Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
- రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకష్ణారెడ్డి
నవతెలంగాణ -మోత్కూర్
యాదాద్రి జిల్లాలో 6 వేల ఎకరాల్లో రైతులు ఆయిల్ ఫామ్ చేసేలా కృషి చేస్తున్నామని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలో రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించేందుకు కృషి చేసిన మంత్రి జగదీశ్ రెడ్డిని మంగళవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి కతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు చేసే విధంగా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆయిల్ ఫామ్ సాగు కోసం మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో నర్సరీ ఏర్పాటు చేసి 4 లక్షల మొక్కలు పెంచుతున్నామని, ప్రస్తుతం ఆ మొక్కలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకొచ్చే రైతులకు ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరి నాటికి రైతులకు మొక్కల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. సాగులో రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు జిల్లాలోని ప్రతి మండలానికి సంస్థ ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించామని, రైతులు వారి వద్ద తమ భూముల వివరాలు నమోదు చేయించుకోవాలని కోరారు. ఆయిల్ ఫామ్ మొక్కలు ఒక్కసారి నాటితే 40 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని, తక్కువ పెట్టుబడి, డిమాండ్ ఉన్న పంట, మార్కెట్ లో అధిక ధర ఉండడంతో రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని కోరారు. ఆయన టీఆర్ఎస్ జిల్లా నాయకుడు మందడి రామకృష్ణారెడ్డి ఉన్నారు.