Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంపిణీ విధానాన్ని పరిశీలించిన డీఎస్ఓ
నవతెలంగాణ -నల్గొండ కలెక్టరేట్
ప్రభుత్వం చౌక ధర దుకాణాల ద్వారా ప్రతినెల లబ్ధిదారులకు అందించే నిత్యవసరకులు పంపిణీ కార్యక్రమం మంగళవారం జిల్లాలోని అన్ని రేషన్ షాపుల్లో ప్రారంభమైంది. గతంలో ఈ పాస్ మిషన్లతో రేషన్ డీలర్లు సరుకులను లబ్ధిదారులకు పంపిణీ చేసేవారు. అయితే సమస్యలు తలెత్తి పంపిణీ సక్రమంగా జరిగేది కాదు. దీంతో రేషన్ డీలర్లే, కాక లబ్ధిదారులు నాన అవస్థలు పడేవారు. ఈ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం గత జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని రేషన్ డీలర్లకు 4జి ఈపాస్ మిషన్లను అందించింది. అందులో భాగంగానే జిల్లాలోని రేషన్ డీలర్లు అందరికీ నూతన 4జీ ఈపాస్ మిషన్లు అందాయి. దీనికి సంబంధించి సరుకులను ఎలా పంపిణీ చేయాలో ఈపాస్ మిషన్లను ఎలా ఉపయోగించాలో తెలిపేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ డీలర్లకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలను పూర్తయ్యాయి. కాగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు పట్టణంలోని షాప్ నెంబర్ 43 ను ఆకస్మికంగా తనిఖీ చేసి లబ్ధిదారులకు నిత్యవసర సరుకుల పంపిన విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్ఓ డీలర్లకు పలు సూచనలు సలహాలను అందించారు. రేషన్ షాపులను నిర్ణీత సమయాలలో తెరచి ఉంచాలని పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందని సూచించారు. తనిఖీ సమయంలో డిఎస్ఓ వెంట ఏఎస్ఓ నిత్యానందం, డిటిసిఎస్ యశ్వంత్ ఉన్నారు.