Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి హైకోర్టు మాజీ న్యాయమూర్తి బి.చంద్రకుమార్
నవతెలంగాణ -రామన్నపేట
గ్రామీణ గ్రంథాలయ నిర్మాతగా గొప్ప పేరు తెచ్చుకున్న డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య సంకల్పం, ఆదర్శం, అభినందనీయమనిలి ఉమ్మడి హైకోర్టు మాజీ న్యాయమూర్తి బి చంద్రకుమార్ అన్నారు. ప్రముఖ రచయిత జ్ఞానపీఠ ప్రస్కృతులు డాక్టర్ రావూరి భరద్వాజ 95వ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాదులో డాక్టర్ రావూరి భరద్వాజ పురస్కారాన్ని మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, భారత ప్రధాని ప్రశంసలందుకొనినా డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు ఉమ్మడి హైకోర్టు మాజీ న్యాయమూర్తి బి చంద్రకుమార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి వినాక్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందజేస్తూ ముఖ్య అతిథులు ఉమ్మడి హైకోర్టు మాజీ న్యాయమూర్తి బి చంద్రకుమార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి వినాక్ మారుమూలలో మహా గ్రంథాలయం నెలకొల్పనా ఆచార్య కూరెళ్ల అభినందనీయుడని కొనియాడారు. రావూరి పురస్కారం రచయితగా కవిగా విమర్శకుడిగా పరిశోధకుడిగా ఉద్యమ మూర్తిగా గ్రామీణ గ్రంథాలయ నిర్మాతగా గొప్ప పేరు తెచ్చుకున్న డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు ప్రధానం చేయడం ఎంతో సుముచితమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకతి సంస్థ అధ్యక్షులు సుధాకర్, సాహితీవేత్తలు, కవులుపాల్గొన్నారు.