Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఇఫ్తికార్నజీర్
నవతెలంగాణ-సూర్యాపేట
ఈ నామ్ విధానం ద్వారా మార్కెట్లో రైతులకు మేలు జరుగుతుందని, రాష్ట్రవ్యాప్తంగా ఈనామ్ అమలుకు కృషి చేస్తామని మార్కెటింగ్ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఇఫ్తికార్ నజీర్ అన్నారు.సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ రాష్ట్ర స్ధాయిలో ఉత్తమ ఈనామ్ అవార్డు సాధించిన సందర్భంగా మార్కెట్లో ఈనామ్ విధానం అమలుపై అధ్యయనం చేయడానికి డిప్యూటీ డైరెక్టర్ పద్మహరిష,డీఎంఓలు సారిక, బాలామణి, పుష్పమ్మ, స్వర్ణజిత్ సింగ్ తదితరులు బుధవారం సూర్యాపేట మార్కెట్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా ఇఫ్తికార్ నజీర్ మాట్లాడుతూ సూర్యాపేట మార్కెట్లో ఈనామ్ విధానం సమర్థవంతంగా అమలు జరుగు తుందన్నారు.సూర్యాపేట మార్కెట్ ఇతర వ్యవసాయ మార్కెట్లకు ఆదర్శంగా నిలిచిందన్నారు.వరంగల్ రీజినల్ మార్కెటింగ్ అధికారి లక్ష్మణుడు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు జాతీయస్ధాయిలో ప్రధానమంత్రి అవార్డు లభించిందని తెలిపారు.మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవి ఆనంద్ మాట్లాడుతూ రీజినల్ డైరెక్టర్ లక్ష్మిబాయి ఆదేశాల మేరకు జేడీ, ,డీఎంఓలు, సెక్రటరీలు సూర్యాపేటమార్కెట్లో ఈనామ్ అమలుపై అధ్యయనానికి వచ్చారని, వారికి ఈనామ్ అమలుపై పూర్తి వివరాలు అందించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి ఫసియోద్దీన్, అదనపు కార్యదర్శి పుష్పలత, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.