Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ రెమా రాజేశ్వరి
నల్లగొండ :జిల్లాలో పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు . తెలంగాణ రాష్ట పోలీసు శాఖ చేపట్టిన 16 ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు అయ్యేలా చూడాలని మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించు కుంటూ నేర విచారణలో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా కన్విక్షన్ రేటుని పెంచాలని, జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట పోలీసు శాఖ చేపట్టిన 16 ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించు కుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాల న్నారు. ఈ సందర్భంగా విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు మరియు సిబ్బంది కి జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆశ్వాక్, (ఓ యస్.డి) ఎస్బీ డీఎస్పీ రమేష్, డీసీఆర్బీ డీఎస్పీ మొగిలయ్య,నల్గొండ డీఎస్పీ నర్సింహారెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ వై.వేంకటేశ్వరరావు, దేవరకొండ డీఎస్పీ నాగేశ్వరరావు,సీఐలు పాల్గొన్నారు.