Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి
నవతెలంగాణ -ఆలేరుటౌన్
పాడి రైతులపై జీఎస్టీ పన్ను 10 శాతం విధించిన బీజేపీ ప్రభు త్వానికి పాడి రైతుల ఉసురు తగిలి ఆ పార్టీ పతనం తప్పదని టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మెన్,ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు . బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాడి పరిశ్రమ పై ఆధారపడి నియోజకవర్గంలో ఎంతో మంది పాడి రైతులు జీవనం సాగిస్తున్నారన్నారు . పాల ఉత్పత్తిపై జీఎస్టీ విధించడం తగదన్నారు .రైతుల పొట్టకొట్టి నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ ప్రభుత్వం రైతుల ముందు తల దించుకుందన్నారు . టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఇచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కాళేశ్వరం, ఇతర పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా 93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్ర ఎంపీలు బండి సంజరు ,బాబూరావ్ ,ధర్మపురి అరవింద్ రైతుల గురించి బీజేపీ ప్రభుత్వంలో ఉండి ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు .పాడిరైతుల జోలికి వస్తే బీజేపీ పతనం ఖాయమన్నారు. గ్యాస్, డీజిల్ ,పెట్రోలు ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. నీచమైన పాలన కొనసాగిస్తుందన్నారు. పాడి రాయితీలపై బేషరతుగా బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ ఉపసంహరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తామంటే ఊరుకునేది లేదన్నారు. కాంగ్రెస్ ప్రతి పక్షం పాత్రలో విఫలమైందన్నారు .రానున్న రోజుల్లో టీఆర్ఎస్ రైతుల పక్షాన నిలిచి పోరాడుతుందని చెప్పారు. ఈ సమావేశంలో నార్మాక్స్ డైరక్టర్ దొంతిరి సోమిరెడ్డి ,మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య ,పీఏసీఎస్ చైర్మెన్ మొగలగని మల్లేశం, వైస్చైర్మెన్్ చింతకింది చంద్రకళ మురహరి ,గొర్ల కాపరుల సంఘం డైరెక్టర్ జల్లి నర్సింహులు ,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కోటగిరి పాండరీ, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, పుట్టా మల్లేశం ,గ్రంథాలయాల డైరెక్టర్ బాలస్వామి, పీఏ సీఎస్ డైరెక్టర్ బీస కష్ణంరాజు , వార్డు కౌన్సిలర్ బేతి రాములు , నాయకులు పాశికంటి శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.