Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని తుంగపాడు మోడల్స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు.ఆ తర్వాత కోదాడ-జడ్చర్ల రహదారిపై రాస్తారోకో చేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ముడవత్ జగన్నాయక్ మాట్లాడారు.ప్రభుత్వం మధ్యాహ్న భోజనం మెనూ పెంచకుండా అరకొర వసతులతో భోజనాన్ని అందించడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.తుంగపాడు మోడల్స్కూల్లో విద్యార్థులకు ఉడికి ఉడకని అన్నంతో భోజనాన్ని అందిస్తున్నారని విమర్శించారు.విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణలోపం వల్ల ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలంటే మధ్యాహ్న భోజనం మెనూ పెంచాలని కోరారు.ప్రభుత్వం ఎమ్మెల్యే, మంత్రుల జీతాలు పెంచుకోవడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ పేద మధ్యతరగతి విద్యార్థులకు ఆదుకునేందుకు డబ్బు లేవని చెప్పడం సిగ్గుచేటన్నారు.పేద విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో మెనూ పెంచడంలో ఈ ప్రభుత్వం విఫలమవుతుందన్నారు.వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని మధ్యాహ్నభోజనంలో మెనూ పెంచాలని కోరారు.ఈ కార్యక్రమంలో దామరచర్ల మండలకార్యదర్శి వీరన్న, డివిజన్ కమిటీ సభ్యులు తరుణ్నుమాన్, ఉపేందర్, చందు, భరత్, స్వామి, లక్కీ పాల్గొన్నారు.