Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం నుండి వలిగొండ రోడ్డు మీదుగా పద్మశాలి కాలనీ వరకు సర్వీసు రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్‌చేస్తూ బుధవారం సీపీఐ(ఎం) మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో వలిగొండ రోడ్డు నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి, అనంతరం కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.పాషా మాట్లాడారు. సర్వీసు రోడ్డును ఏర్పాటుచేయకపోవడంతో ప్రజలు, ద్విచక్ర వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తంగడపల్లి రోడ్డు పనులు ప్రారంభించి సంవత్సరం కావస్తున్నా పనులు పూర్తికాకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. రోడ్డు పనులు పూర్తిచేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు, జీఎంఆర్ సంస్థ సర్వీసు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతూ ఆర్డీఓ ఎస్.సూరజ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహా, ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, నాయకులు దండ అరుణ్‌కుమార్, ఆకుల ధర్మయ్య, బత్తుల దాసు, భావండ్లపల్లి స్వామి, చీకూరి ఈదయ్య, బొమ్మకంటి కష్ణ, గంజి రామచంద్రం, ఎర్ర ఊషయ్య, బాతరాజు దశరథ, గుణమోని అయిలయ్య, బొడ్డు అంజిరెడ్డి, ఎస్కె.మదార్, రాజుగౌడ్, మొగుదాల రాములు, వెల్తురి జంగయ్య, జాజుల బిక్షపతి, గంట శంకర్‌రెడ్డి, కొత్త సత్తయ్య, శివ పాల్గొన్నారు.