Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ -నల్గొండ కలెక్టరేట్
మన ఊరు -మన బడి, మన బస్తీ- మన బడి కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల ఆన్ లైన్ నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మన ఊరు-మన బడి, మన బస్తీ -మన బడి కార్యక్రమం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో జరుగుతున్న, జరగాల్సిన పనులపై ఇంజనీర్లతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలంలోనూ ఇంజనీర్లు తమకు కేటాయించిన ఎంపీడీఓలు, ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు, స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మెన్లు, సర్పంచ్ లను సమన్వయం చేసుకుని పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇంజనీర్లు ఆయా పాఠశాలలకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా అవసరమైన అదనపు తరగతి గదుల నిర్మాణానికి తగిన ప్రణాళిక వేసుకుని ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆన్ లైన్ పనులకు సంబంధించిన వివరాలను ఎలా నమోదు చేయాలో ఇంజనీర్లకు అవగాహన కలిపించారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ నరేందర్ రెడ్డి, పంచాయితీ రాజ్ ఈఈ తిరుపతయ్య, విద్య,సంక్షేమం, మౌలిక సదుపాయాల సంస్థ ఈ ఈ అనిత, తదితరులు పాల్గొన్నారు.
చందుపట్లలో జిల్లా కలెక్టర్ పర్యటన
నకిరేకల్:కాకతీయ వైభవ సప్తాహంలో బాగంగా జిల్లాలో ఒక రోజు కార్యక్రమం నకిరేకల్ మండలం చందు పట్లలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.బుధవారం కలెక్టర్ అధికారులతో కలిసి చందు పట్ల గ్రామం సందర్శించి ఏర్పాట్లు పై చర్చించారు. కాకతీయ పరిపాలకు రాలు రాణి రుద్రమ దేవి మరణ ప్రస్తావన ఉన్న చందు పట్ల శాసనం అరుదైన ముఖ్యమైనది గ్రామంలో వున్నదన్నారు.ఈ నెల 7 న వరంగల్ లో కాక తీయ వైభవ సప్తాహం ఉత్సవాలు ప్రారంభించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాటు నల్గొండ జిల్లాలో నకిరేకల్ చందుపట్ల గ్రామంలో ఒక రోజు నిర్వహించనున్నారు.చందు పట్ల లో చందు పట్ల శాసనం,రాణి రుద్రమ దేవి విగ్రహం,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను జిల్లా కలెక్టర్ సందర్శించి అధికారులు,గ్రామస్థులతో మాట్లాడారు గ్రామం లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శి ని ఆదేశించారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేదిక,సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహణకు అనువుగా రూపొందించాలని సూచించారు. విశ్రాంత చరిత్ర అధ్యాపకులు సూర్యకుమార్ చందు పట్ల శిలాశాసనం,చరిత్ర ప్రాధాన్యత గురించి జిల్లా కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్ వెంట డీఅర్ఓజగదీశ్వర్ రెడ్డి, డీఈఓ.బిక్షపతి, డీపీఆర్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ వెంకటేశ్వర్ రావు, తహశీల్దార్ ప్రసాద్, పురావస్తు శాఖ అధికారి ఆదిత్య శర్మ ఉన్నారు.