Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాకేంద్రంలోని దురాజ్‌పల్లి సమీపంలోని శ్రీ స్వామినారాయణ్ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ సూర్యాపేట వేదికగా జరిగిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి సర్టిఫికెట్స్ ప్రదానోత్సవ కార్యక్రమంలో సంగీత జగత్తులో ఒక కొత్త వొరవాడికి శ్రీకారం చుట్టారు. ఇద్దరు సోదరులు 6 వ తరగతి చదువుతున్న మాస్టర్ జి ,సాత్విక్ 3 వ తరగతి చదువుతున్న మాస్టర్ జి ,వేదిక్ శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు.వీరి తండ్రి శ్యామ్‌కుమార్ ప్రముఖ వైద్యనిపుణులు, తల్లి ప్రశాంతి సూర్యాపేట ప్రథమ అదనపు మేజిస్ట్రేట్‌గా ఉన్నారు.మాస్టర్ సాత్విక్ గిటారుపైన కండ్లకు గంతలు కట్టుకొని దేశభక్తి గీతాలు 17 నిముషాల పాటు అలవోకగా ఆలపించగా మాస్టర్ వేదిక్ కూడా కీబోర్డుపైన 12 దేశభక్తి పాటలు 15 నిముషాల పాటు ఆలపించి అబ్బురపరిచారు.దీంతోతెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రత్యేకవిభాగంలో వారి పేర్లను నమోదు చేస్తూ ఆ సంస్థ అధ్యక్షులు, చైర్మెన్ డాక్టర్ చింతపట్ల వెంకటాచారి ఆ చిన్నారులకు ధ్రువీకరణపత్రం, జ్ఞాపిక, మెడల్, బ్యాడ్జితో సత్కరించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిధిగా గురుకులు స్కూల్ నిర్వాహకులు శ్రీ త్రిదాస్స్వామీజీ, స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ఆనంద్, హార్దిక్ పాదరియా స్కూల్ డైరెక్టర్, మ్యూజిక్ అధ్యాపకుడు అడ్ల శ్రీనివాస్‌రావు, శ్రీవాణి, సీనియర్ సివిల్ జడ్జి, తదితరులు హాజరయ్యారు. అనంతరం చిన్నారులు రికార్డు అందుకున్న సందర్భంగా వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.