Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూసివేసిన పంట కాలువలు
నవతెలంగాణ-నేరేడుచర్ల
పురపాలిక పరిధిలోని నేషనల్ హైవేపై చేస్తున్న నిర్మాణంలో ఒక్కో చోట ఒక్కో కొలతలతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ నాణ్యత లేకుండా పనులు చేయిస్తున్నారని, అదేవిధంగా పంటకాలువలను మూసివేయడం సరికాదని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు పారేపల్లిశేఖర్రావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పాల్వాయిరమేశ్ విమర్శించారు.బుధవారం వారు పట్టణంలో విలేకర్లతో మాట్లాడారు.పట్టణంలో రొండు కిలోమీటర్ల పరిధిలో ఒక దగ్గర 73/74/69/72 కొలతల వ్యత్యాసాలతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని, దీనివలన భవిష్యత్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.అంతేకాకుండా రోడ్డు నిర్మాణంలో కూడా నాణ్యత లోపించిందని, హైవేకు రెండుపక్కల రెండు డ్రయిన్ల మధ్య ఉండాల్సిన కొలతల్లో చాలా వ్యత్యాసాలతో పనులు కొనసాగిస్తున్నారన్నారు.ఈ విధంగా కాంట్రాక్టర్లు పెద్దఎత్తున డబ్బు మిగిలించుకునే పరిస్థితి ఉందన్నారు.ఈవిషయాన్ని పలుమార్లు అధికారుల దష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందన్నారు. హైవే అధారిటీ, నిబంధనలకు విరుద్ధంగా ఇన్ని రకాల కొలతలు ఎందుకు , ఎవరి మేలుకోసమని ప్రశ్నించారు.ప్రధానంగా సీపీఐ(ఎం) కార్యాలయం రోడ్డు గుండా వెళ్లే పంటకాలువ 3ూ ణూ కాలువను ఎందుకు డ్రయిన్గా మారుస్తున్నారని ప్రశ్నించారు.పంటకాలువను ఎందుకు మూసివేస్తున్నా రన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి పనుల్లో నాణ్యత ఉండేలా వాస్తవమైన కొలతలతో రోడ్డు ఏర్పాటు చేస్తూ పంటకాలువలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నగేష్, నాయకులు రామ్మూర్తి, సామాజిక కార్యకర్త బెల్లంకొండ శేఖర్, టీడీపీ నాయకులు మల్యాద్రి పాల్గొన్నారు.