Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింత బాబుమాదిగ
కోదాడరూరల్ : మండలపరిధిలోని పులిచింతల పునరావాస గ్రామమైన అడ్లూరు ఆర్అండ్ఆర్ సెంటర్లో సుమారు ఎకరంన్నర భూమిని కబ్జా చేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకొని భూమిని కాపాడాలని టీఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధానకార్యదర్శి చింతబాబు మాదిగ డిమాండ్ చేశారు.బుధవారం ఆక్రమణకు గురైన భూమిని ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు.గుడిబండ గ్రామానికి చెందిన రైతు వద్ద నుండి పునరావస లేఅవుట్ కోసం ప్రభుత్వం డబ్బులు చెల్లించి భూమిని కొనుగోలు చేసిందన్నారు.ఆ భూమిని మళ్లీ రైతు కబ్జా చేసి సాగు చేసుకుంటున్నారని ఆరోపించారు.వెంటనే అధికారులు జోక్యం చేసుకుని సర్వే చేయించి హద్దురాలు ఏర్పాటుచేసి కబ్జాదారుల నుండి భూమిని కాపాడాలన్నారు. అదేవిధంగా మిగిలిన నిజమైన లబ్దిదారులకు న్యాయం చేయాలన్నారు. లేనిపక్షంలో వానాకాలంసీజన్లో రైతు పంట వేయకుండా అడ్డుకుంటా మన్నారు.ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహి స్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ హుజూర్నగర్ ఇన్చార్జి కష్ణబాబుమాదిగ, టీఎమ్మార్పీఎస్ జిల్లా వికలాంగుల అధ్యక్షులు కొమ్మురామయ్య, సీహెచ్.సైదులు, గువ్వల రామకోటయ్య, రామాం జనేయులు, ప్రకాష్‌రావు, వెంకట్‌రెడ్డి, గువ్వల వెంకటరమణ పాల్గొన్నారు.