Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్
నవతెలంగాణ-సూర్యాపేట
కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోమపంగు కిరణ్ మృతి సామాజికఉద్యమాలకు తీరని లోటని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ అన్నారు. మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన కిరణ్ అకస్మాత్తుగా మతి చెందడంతో బుధవారం స్థానిక ఎంవీఎన్భవన్లో జరిగిన కార్యక్ర మంలో మృతుని చిత్రపటానికి ఆయన పూలమాలలేసి నివాళులర్పిం చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారన్నారు.నర్సింహులగూడెం అమరవీరుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడంలో ప్రజలను కదిలి ంచడంలో ముందుండే వారన్నారు.కిరణ్ అకస్మాత్తుగా మర ణించడం బాధాకరమని,మృతుని కుటుంబానికి సీఐటీయూ రాష్ట్ర కమిటీ తరఫున సంతాపం సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నెమ్మాది వెంక టేశ్వర్లు,కొలిశెట్టియాదగిరిరావు, కేవీపీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి కోటగోపి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు చెరుకు ఏకలక్ష్మి, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బచ్చలకూరి రాంబాబు, వేల్పుల వెంకన్న ,జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయినరవి,జిల్లా నాయకులు సోమపంగు రాధాకష్ణ, రోశపతి, రాంబాబు, రణమియా, మామిడి సుందరయ్య, యాతాకుల వెంకన్న, ఎలుక సోమన్న తదితరులు పాల్గొన్నారు.