Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జోన్ వి.జ్యోతిర్మయి
నవతెలంగాణ -నల్లగొండ
ఆహార కల్తీ జోరుగా సాగుతుందన్న ఆరోపణలు అవాస్తవం అని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జోన్ వి .జ్యోతిర్మయి అన్నారు. గురువారం పట్టణంలోని ఆర్అండ్బీగెస్ట్ హౌస్లో విలేకర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఆహార కల్తీ జరుగుతుందని ఆరోపణలు ఉన్నా సంబంధిత అధికారులు దష్టి సారించడం లేదన్న వార్తను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. రోడ్ల వెంబడి ఉన్న హోటల్స్ , దాబాలు , టిఫిన్ సెంటర్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ప్రజలు నిత్యం అనేక ఆహార పదార్థాలు టీ, కాఫీ, పానీయాల నాణ్యతను అను నిత్యం పరిశీలించి కల్తీ కాకుండా చూసి ప్రజలు సురక్షితమైన ఆహారాన్ని తీసుకునేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మొక్కుబడిగా తనిఖీలు చేసి నమూనాలు తీసుకొని సదరు యాజమాన్యముతో సెటిల్ చేసుకొని కేసులు కాకుండా చేస్తున్నారనే ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ప్రయోగశాల రిపోర్టు ఆధారంగా సదరు వ్యాపారులపై చర్యలుంటాయి.అలా తీసుకున్న చర్యలు అధికముగానే ఉన్నాయాన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ఏప్రిల్ , 2021 నుండి నేటి వరకు నిషేధిత పొగాకు ఉత్పత్తులను కోటి ముప్పది లక్షల రూపాయల నరుకును స్వాధీనము చేసుకొని కమీషనర్ ఆదేశాల మేరకు ధ్వనం చేసి సంభందిత వ్యాపారులకు ఫెనాల్టీ విధించటము జరిగినదన తెలిపారు. కార్పోరేట్ స్థాయి వ్యాపారులకు సంబంధించిన అధికారులకు ముడుపులు పంపిస్తున్న ఆరోపణలు పూర్తిగా అవస్థవమని అన్నారు.ఉమ్మడి జిల్లాలో తనిఖీలు నిరంతంరం జరుగకపోవడంతో కొన్ని హెరీటల్స్ ధరలు 4,5 రెట్లు ఎక్కువగా ఉన్నాయి ధరలు పెంచి వినియోగ దారులను మోసం చేస్తున్నట్లు అన్న విషయము మా చట్ట పరిధిలోకి రాదు . అయినప్పటికీ ఆ విషయము గురించి కూడా వ్యాపారులను హెచ్చరిస్తున్నామని అన్నారు.