Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
ఎఫ్సీఐ ఎదుట ధర్నా
నవతెలంగాణ- నల్లగొండ
భారత ఆహార సంస్థ గొల్లగూడ గోదాంలో పనిచేస్తున్న క్యాజువల్ కార్మికుల ఉపాధిని కాపాడాలని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర గౌరవాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఎఫ్సీఐ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30ఏండ్లుగా గోదాంలో 40మంది మహిళలు , 20మంది పురుషులు, మొత్తం 60మంది క్యాజువల్ కార్మికులుగా పనిచేస్తున్నారన్నారు .ప్రస్తుతం మహిళలు 10 మంది పురుషులు 10 మంది మొత్తం 20 మందికి మాత్రమే పని ఉంటుందని మిగతా 40 మందికి పని లేదని ఎఫ్సీఐ డీఎం చెప్పడంతో పని కోల్పోయి రోడ్డు మీద పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు .అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వీరిని పని నుండి తొలగించడం సరికాదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివాదాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎఫ్సీఐ అధికారులు జోక్యం చేసుకొని క్యాజువల్ కార్మికుల ఉపాధిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, క్యాజువల్ వర్కర్స్ మాండ్ర శ్రీనివాస్, బోయపల్లి చంద్రమ్మ, మారెమ్మ లింగమ్మ ,ధనమ్మ, రాములమ్మ, సత్యమ్మ, యాదమ్మ, సైదమ్మ, రాజేశ్వరి, సరిత, కవిత అలివేలు, తదితరులు పాల్గొన్నారు.