Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- భువనగిరి రూరల్
గ్రామ రెవెన్యూ అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శాంతియుత ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జిల్లాలోని వివిధ గ్రామాల్లో విఆర్వోలుగా విధులు నిర్వహిస్తూ సెప్టెంబర్ 7వ తేదీ 2020 నుంచి జాబు చార్టు రద్దు చేసినట్లు, వీఆర్ఓలకు స్పష్టమైన విధులు బాధ్యతలు లేకుండా అన్ని రకాల ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో ట్రియ్య జిల్లా అధ్యక్షులు భగత్ , జిల్లా అధ్యక్షులు శ్రీశైలం, అధ్యక్షులు రంగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చారి, కోశాధికారి శ్రీనివాస్ , కార్యదర్శి కౌశిక్, ఉపేందర్, ఎల్లయ్య, సత్తయ్య, నరసింహ, రాజేష్ రెడ్డి, సురేష్, శ్రీలత, పద్మ, నరసింహ, హైమద్, యాదగిరి, సత్యనారాయణ, భువనగిరి డివిజన్ గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.