Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు
నవతెలంగాణ -మోతే
గత ప్రభుత్వం పేదల ఇండ్ల నిర్మాణం కోసం మండలంలోని రావి పహాడ్ గ్రామంలో మంజూరు చేసిన స్థలాలలో క్రీడా మైదానం నిర్మించాలని ప్రభుత్వ ఆలోచన ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు డిమాండ్ చేశారు. గురువారం రావి పహాడ్ గ్రామంలోని సీపీఐ(ఎం), ఆ సంఘం ఆధ్వర్యంలో సర్వేనెంబర్ 626, 627 ,628 లలో6.37 గుంటల భూమిని లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావి పహాడ్ గ్రామంలో 1992 సంవత్సరంలో పేదల ఇండ్ల నిర్మాణం కోసం6.37 గుంటల భూమిని కొనుగోలు చేసి పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చిందన్నారు. పేదలకు ప్రభుత్వం పక్కా ఇల్లు నిర్మించకపోవడం ,తాగునీరు, సీసీ రోడ్లు, కరెంటు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టా కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి పక్కా ఇంటిని నిర్మించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి భూస్వాముల చేతుల్లో ఉందని, ఆ భూమిని బయటకు తీసి దానిలో క్రీడా మైదానాన్ని నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ గ్రామ కార్యదర్శి కుంచం గోపయ్య, మండల కమిటీ సభ్యులు సోమ గాని మల్లయ్య, గ్రామ నాయకులు బాపనపల్లి నాగయ్య ,ములకలపల్లి మల్సూర్ ,వెలుగు వెంకన్న, పొడపంగి ఈదయ్య, కాంగ్రెస్ గ్రామ నాయకులు వీరమల్ల వెంకన్న ,సోమ గాని రాంబాబు తదితరు పాల్గొన్నారు.