Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్.లింగోటంలో యోగ, ధ్యాన కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
మనిషి మానసిక ప్రశాంతత తో ఉంటే అన్ని రకాల సమస్యలను జయించవచ్చని సర్వేజన సుఖినోభవంత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సోమ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి తాత నానమ్మ ల జ్ఞాపకార్ధం తండ్రి ఇచ్చిన 300 గజాల్లో,కుటుంబ సభ్యుల సహకారంతో యోగ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు.ఈ యోగ, ధ్యాన కేంద్రాన్ని గురువారం శ్రీనివాస్ రెడ్డి తండ్రి మాజీ జడ్పీటీసీ సోమ జనార్దన్ రెడ్డి-లక్ష్మమ్మ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసక్తి,పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. సమాజంలో జరుగుతున్న దాడులకు మానసిక ప్రశాంతత లేకపోవడమే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సోమ జనార్దన్ రెడ్డి,మాజీ సర్పంచ్ సోమ లక్ష్మమ్మ, బ్రహ్మా కుమారి స్వర్ణలత, యోగ ట్రైనర్ పాండు, సింగిల్ విండో వైస్ ఛైర్మన్ చెన్నగొని అంజయ్య,ఉప సర్పంచ్ గంగాపురం గంగాధర్, వార్డు సభ్యులు ఢిల్లీ మాధవరెడ్డి,పక్కీర్,సామాజిక ఉద్యమకారులు మన్నే నర్సింహారెడ్డి, పిసాటి జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.