Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయిన వాటిని పేదలకు పంచకపోవడంతో తర్వాత పిచ్చి మొక్కలకు, అసాంఘిక కార్యాక లాపాలకు నిలయమంగా మారాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. గురువారం మిర్యాలగూడ పట్టణం గూబ్లీ కాలనీ వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండలను ఆ పార్టీ బందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018- 2019లో పూర్తయినటువంటి దాదాపు 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వాటికి కనీస సౌకర్యాలను కల్పించకుండా , పేదలకు పంచకుండా నిరుపయోగంగా ఉండడంతో అవి శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే అనేక రూముల వద్ద కిటికీలు తలుపులు విరిగిపోయి ఉన్నాయన్నారు. పూర్తయిన ఇండ్లను పంపిణీచేయాలని ప్రజానికం కోరుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదన్నారు. అనేకమంది ఆ ప్రాంతంలోఇండ్ల పట్టాలు కలిగి ఉన్నారని ముఖ్యమంత్రి ప్రకటించినట్టుగా ఇండ్ల నిర్మాణం కోసం తక్షణమే మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైనటువంటి పేదవారికి ఇండ్ల పంపిణీ చేయకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తామే పేద ప్రజానీకానికి ఇండ్ల పంపిణీ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీరాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, వన్ టౌన్, టూ టౌన్ కార్యదర్శులు మల్లు గౌతమ్ రెడ్డి, బావండ్ల పాండు, జిల్లా కమిటీ సభ్యులు రవి నాయక్,,నాయకులు పాతని శ్రీను మాజీ కౌన్సిలర్ దేశరాం,నాయకులు పిల్లుట్ల సైదులు, ఇద్దయ్య, రామారావు, వెంకటరెడ్డి,వెంకటయ్య, పాపిరెడ్డి, రుద్ర సైదులు,తదితరులు పాల్గొన్నారు.