Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ- నల్గొండ కలెక్టరేట్
పట్టణంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులు సత్వరమే పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను, ఇంజనీర్లను, కంట్రాక్టర్లను, ఏజెన్సీ నిర్వాహుకులను ఆదేశించారు. గురువారం నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. చర్లపల్లిలో అర్బన్ పార్కు పనులు పరిశీలించి మొక్కలు ఏపుగా ఏదిగేలా అవసరమైన ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎంట్రన్స్ గేట్ వద్ద పరిశీలించి తగు సూచనలు చేశారు. అర్బన్ పార్కు నిర్మాణంలో భాగంగా వచ్చే సందర్శకుల కోసం పార్కింగ్, ఫుడ్ కోర్టు, టారు లెట్స్ వంటి సౌకర్యాల గురించి మున్సిపల్ కమిషనర్‌తో చర్చించారు. మర్రిగూడ బైపాస్ జంక్షన్ అభివద్ధి పనులలో భాగంగా మిషన్ బగీరథ ట్యాప్, అశోక చక్ర, వెల్ కమ్ నల్లగొండ స్థలాలను పరిశీలించారు.అక్కడ అవసరమైన వాటర్, ఎలక్ట్రిసిటీపై చర్చించారు. హైదరాబాద్ రోడ్డు డివైడర్ల మధ్యలో అమర్చుతున్న చార్జబుల్ లైట్స్ పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారని ఏజెన్సీ నిర్వాహుకులను అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రీకల్ టవర్స్ క్లాక్ టవర్ వరకు ఎక్కడా పెండింగులో ఉంచకుండా వెంటనే పనులను పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. పట్టణంలో రెండు సైడ్లలలో రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతాలలో బస్తాలలో మట్టిని నింపి వరుసగా పెట్టడం లేదా సూచికలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ రోడ్డులోని ఎల్.వి. పెట్రొల్ బంకు నుండి క్లాక్ టవర్ వరకు జరుగుతున్నరోడ్డు పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున టార్గెట్ పెట్టుకుని రెండు షిప్టులలో పనులు చేయాలన్నారు. పట్టణంలో జరుగుతున్న డ్రయినేజీ పనులను పర్యవేక్షించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. బీట్ మార్కెట్ యార్డులోని వెజ్, నాన్ వెజ్ మార్కెటింగ్ పనులను పరిశీలించారు. మార్కెట్‌ను అనుగుణంగా ఫ్లాట్ ఫామ్, గ్రానైట్, ఎలక్ట్రిసిటీ, వెల్ వేషన్ పనులను వేగంగా జరగాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. మార్కెట్ లోని రేట్లను సూచించే ఎల్ఈడీ స్క్రీన్ పై మున్సిపల్ కమిషనర్‌తో చర్చించాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను సూచించారు. క్లాక్ టవర్ సెంటర్లో నూతనంగా నాలుగు కూడళ్లకు కనిపించే విధంగా క్లాక్ టవర్‌తో పాటు జాతీయ జెండా ఏర్పాటు, ఫౌంటేన్, మొదలగు అన్ని రకాల పనులపై చర్చించారు. క్లాక్ టవర్ సెంటర్ లోని మార్కింగ్ ప్రకారం షాపులను తొలగించే పనులను పర్యవేక్షించాలన్నారు. దేవరకొండ రోడ్డులోని పనులు వేగంగా జరిగేటట్లు సంబంధిత ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. డీఈఓ ఆఫీస్ వరకు ఎప్పటి వరకు పూర్తి అవుతుందో నివేదిక రూపరలో తనకు సమర్పించాలని ఆదేశించారు. అనంతరం రామ్ నగర్ పార్కులో పర్యటించి అక్కడ నిరుపయోగంగా ఉన్న పరికరాలను వెంటనే తరలించాలని ఇంజనీర్లను ఆదేశించారు. బోటింగ్ ప్రాంతాన్ని పర్యటించి అక్కడ సందర్శకులను ఆకర్శించే విధంగా అందంగా పేయింట్స్, మొక్కలతో అలంకరించాలని సూచించారు. టికెట్ కౌంటర్లు, ఇటీవల పూర్తి చేసిన బెంచీలను, ఫౌంటేన్, ఆర్చ్ పనులను పరిశీలించి విద్యుత్ మరమ్మతులు చేయాలని తెలిపారు. పార్కులలో ఎంట్రెన్స్, ఫుడ్ కోర్టు, పార్కింగ్, టారు లెట్స్, బోటింగ్, మొదలగు ప్రాంతాలలో ఏర్పాటు చేసే నేమ్ బోర్డులు వుడ్ ఫ్రేమ్ బోర్డులలో మాత్రమే ఏర్పాటు చేయాలని సంబంధిత ఏజెన్సీ నిర్వాహుకులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్ డా. రమణాచారి, అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.