Authorization
Sat March 22, 2025 09:28:40 am
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న పట్ట,అటవీ భూ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యల పరిష్కరించేందుకు ఎంతో కసరత్తు చేసి ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ధరణి తో ఉన్న సమస్యలకు తోడు అదనంగా మరికొన్ని సమస్యలు ఉత్పన్నం అయ్యాయన్నారు. తరతరాల నుంచి వారసత్వంగా వస్తున్న భూములు ప్రభుత్వ జాబితాలో చేర్చారని,విస్తీర్ణం తక్కువ నమోదు చేశారని దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తక్షణమే ధరణి లో ఉన్న సమస్యలను పరిష్కరించి అటవీ భూమిపై సేద్యం చేసుకున్న రైతులకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈనెల 15 నుండి జరిగే రెవెన్యూ సదస్సులకు కలెక్టర్ , ఆర్డీఓ, ఎమ్మార్వో ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు ఏర్పుల సుదర్శన్ నాయకులు బద్దుల యాదగిరి. రేవనపల్లి గోపాల్ .వలిగొండ మాధవ్ పగిళ్ళ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.