Authorization
Sat March 22, 2025 11:07:02 am
చివ్వెంల :యుద్ద ప్రాతిపదికన ఖాశీంపేట నుండి చివ్వెంల వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని,చివ్వెంల నుండి సూర్యాపేట వరకు రోడ్డు గుంతలు పుడ్చాలని సీపీఐ(ఎంఎల్ ) ప్రజాపంథా జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివ కుమార్ డిమాండ్ చేశారు.ఆదివారం ఆ పార్టీ, పీఓడబ్య్లూ ఆధ్వర్యంలో ఖాశీంపేట నుండి చివ్వెంల వరకు పాదయాత్ర చేసి రోడ్లపై నాటేస్తూ మండలకేంద్రంలో నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో పీఓడబ్య్లూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ,పీడీఎస్యూ జిల్లా అద్యక్షుడు పుల్లూరి సింహాద్రి, జయమ్మ, సంతోషి, రేణుకా, కవిత, వీరబాబు,హుసేన్,పరుశరాం,వీరన్న, రామోజీ,నారాయణ పాల్గొన్నారు.