Authorization
Mon April 28, 2025 12:29:04 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
మండలపరిధిలోని ఔరవాణి గ్రామంలో ఆదివారం విద్యుద్ఘాతంతో మెకానిక్ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని గాడి ఉపేందర్ వ్యవసాయ భావి దగ్గర మోటర్ చే డిపోవడంతో బాగు చేసేందుకు గాను గ్రామానికి చెందిన ఎక్కురి ఈ దయ్య(59) మోటర్ బయటకు తీస్తుండగా పక్కనే ఉన్న ఎల్టి లైన్ వైరు మీద మోటర్ పైపు బడి కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మతి చెందినట్లు పేర్కొన్నారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బొడిగె రామకృష్ణ పేర్కొన్నారు.