Authorization
Sat March 22, 2025 08:28:34 am
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు గంటపంగి లచ్చయ్య ఆశయ సాధన కోసం నేటి తరం యువత పోరాటాలు ఉధతం చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు.మండలపరిధిలోని తాళ్లకాంపాడు గ్రామంలో శనివారం తెలంగాణ సాయుధ పోరాట యోధులు స్వాతంత్య్రసమరయోధులు లచ్చయ్య దశదినకర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లచ్చయ్య పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత తాళ్లకంపాడు గ్రామానికి మొట్టమొదటి సర్పంచ్‌గా ఎన్నికై గ్రామాభివద్ధికి పాటుపడ్డారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులుగా పనిచేసి వ్యవసాయ కార్మికులు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక పోరాటాలు చేశాడన్నారు.ఆయన ఆశయ్య సాధన కోసం నేటితరం పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారుఈ. కార్యక్రమంలో పార్టీ ఇజల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మేకనబోయిన శేఖర్, ఎల్గూరి గోవింద్, కోట గోపి,చిన్నపంగి నర్సయ్య, సీనియర్ నాయకులు చెరుకు సత్యం,మామిడి సుందరయ్య లచ్చయ్య కుమారుడు,శాఖ కార్యదర్శి గంటపంగి చంద్రయ్య పాల్గొన్నారు.