Authorization
Sat March 22, 2025 05:07:56 am
- ఎస్పీ రెమారాజేశ్వరి
నవతెలంగాణ-దేవరకొండ
సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పోలీసు పనివిధానంలో మార్పు రావాలని ఎస్పీ రెమారాజేశ్వరి సూచించారు. మంగళవారం దేవరకొండ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని చందంపేట, నేరేడుగొమ్ము, దేవరకొండ, పోలీస్ స్టేషన్లను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.దేవరకొండ పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.అనంతరం మాట్లాడుతూ సాధారణ సందర్శనలో భాగంగా వివిధ పోలీస్స్టేషన్లను సందర్శించడం జరిగిందన్నారు. సమాజం ముందుకెళ్తున్న తరుణంలో అందుకు అనుగుణంగా పోలీసులలో మార్పు రావాలన్నారు.పాత అలవాటును వదిలిపెట్టి ప్రజల దగ్గరికి వెళ్లి పనిచేయాలని సూచించారు.ప్రజలు మన దగ్గరికి రావడం కంటే, మనమే ప్రజల దగ్గరకు వెళ్లి పనిచేయాలన్నారు.అప్పుడే పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం ఏర్పడి పోలీసు వ్యవస్థ విజయవంతమవుతుందన్నారు.జిల్లా విభజన తర్వాత జోనల్ వ్యవస్థ ఏర్పడిన అనంతరం పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది కొరత ఉందని, ప్రస్తుతం రిక్రూట్మెంట్ జరుగుతున్నందున సమస్య తీరుతుందన్నారు.వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల దొంగతనాల కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు.ప్రధాన రహదారులతో పాటు ఇతర వీధులలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నిఘావ్యవస్థను పటిష్టం చేసుకోవచ్చన్నారు.దేవరకొండ పట్టణంలో అన్ని వార్డులలో మరిన్ని సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రజాప్రతినిధులు,వ్యాపారస్తులు, ఇతర స్వచ్ఛందసంస్థల సహకారం తీసుకోవాల న్నారు.మహిళా రక్షణలో షీటీమ్స్ బందాలు బాగా పనిచేస్తున్నాయన్నారు.షీటీంబృందాలు మహిళల భద్రత కోసం గ్రామగ్రామాన కళాప్రదర్శనలతో అవగాహన కల్పిస్తున్నామన్నారు.దేవరకొండ పోలీస్‌స్టేషన్ నలుగురు ఎస్సైలు పనిచేస్తున్నట్లు వారికి ఏరియా వైజ్‌గా బాధ్యతలు అప్పగిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని సూచించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐ శ్రీనివాసులు, రూరల్ సీఐ పరుశురాం, ఎస్సైలు పాల్గొన్నారు.