Authorization
Sat March 29, 2025 02:15:54 pm
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
ఇంటర్ నేష్నల్ కోస్టల్ క్లీనప్ డే సందర్భంగా స్వచ్చ సాగర్, సురక్షిత్ సాగర్ కార్యక్రమాన్ని శనివారం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె.వి. రమణాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. పానగల్ ఉదయ సముద్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, వివిధ రకాలైన డంపు వ్యర్థాలను క్లీన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పర్యావరణ ప్రేమికులు సురేష్ గుప్తా, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, పర్యావరణ సంరక్షణ్, భారత్ కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థలు, ఇంజనీర్లు ఏఈలు, డిఈలు, శానిటరి ఇన్ స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.