Authorization
Tue March 11, 2025 02:24:15 am
నవతెలంగాణ-బీబీనగర్
మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉదయం పూట అల్పాహారం ద్వారా అందించే రాగిజావను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ ఎరుకుల సుధాకర్‌గౌడ్ అన్నారు.సోమవారం మండలపరిధిలోని మగ్దూంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన రాగి జావను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ జిట్టా రజిత అమరేందర్‌రెడ్డి,ఉపసర్పంచ్ శెట్టి నరేష్‌యాదవ్,వార్డు సభ్యులు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి, పంచాయతీ కార్యదర్శి శైలజ పాల్గొన్నారు.