Authorization
Tue March 11, 2025 11:50:42 am
నవతెలంగాణ -నకిరేకల్
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రం నుండి మండలంలోని మర్రూరు గ్రామానికి చెందిన నకిరేకంటి ఏసు పాదం గురువారం టీపీసీసీ సభ్యుడుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయన నియా మకం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, బ్రహ్మదేవర రమేష్, లింగాల వెంకన్న, గుణగంటి రాజు, అబ్దుల్ మజీద్, బోయిల కిషోర్, ముద్దం విజరు, దుబ్బాక యాదగిరి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.