Authorization
Sat March 22, 2025 08:50:37 am
నవతెలంగాణ -వలిగొండ
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అలంభిస్తోన్న ప్రజా విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం మండలకేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు మెరుగు వెంకటేశం,కూర శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పెట్రోల్,డీజిల్,గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెంచి ప్రజలపై భారాలు మోపిందన్నారు. ఈ కార్యక్రమంలో పీఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు రైతు సంఘం మండల కార్యదర్శి కందడి సత్తిరెడ్డి, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గర్దాస్ నరసింహ మండల కమిటీ సభ్యులు దుబ్బ లింగం,కలుకూరి ముత్యాలు,డీివైఎఫ్ఐ మండల కార్యదర్శి ధ్యానబోయిన యాదగిరి, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వేముల నాగరాజు,నాయకులు అలకుంట్ల నరసింహ, కోరబోయిన మహేష్,దొడ్డి ప్రవీణ్,మొగిలిపాక స్వామి,దొడ్డి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు