Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణంలో బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మెన్ వట్టెజానయ్యయాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.స్థానిక జనగాం క్రాస్ రోడ్డు వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను ఆయన కట్ చేశారు.ఈ సందర్భంగా స్వీట్లు పంచి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ యాదవకుటుంబంలో పుట్టిన వ్యక్తి గొప్ప నాయకుడుగా ఎదుగుతూ తెలంగాణ ఉద్యమంలో తన వంతుగా కీలకపాత్ర పోషించి 2001లో రాజకీయ ప్రవేశం చేసి ఉపసర్పంచ్‌గా, సర్పంచ్‌గా, రెండుసార్లు ఎంపీపీగా ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి జగదీశ్‌రెడ్డి అండదండలతో డీసీఎంఎస్ చైర్మన్ గా ప్రజలకు సేవ చేస్తూ ఓటమి ఎరగని నాయకుడని పేర్కొన్నారు. అదేవిధంగా జానయ్య యాదవ్ జన్మదిన వేడుకలను అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ,సిద్ది సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయం కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎంవీడీ.ప్రసాద్‌రావు గురుస్వామి మాట్లాడుతూ జానయ్య యాదవ్ ఆధ్యాత్మిక వేత్తగా అయ్యప్ప స్వామి మలదారణతో 18 సార్లు స్వామి వారిని దర్శించుకొని అయ్యప్పస్వామి పాదసేవలో తపిస్తున్నారన్నారు.అలాంటి వ్యక్తికి ఆ స్వామి వారి కృపతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని,ఉన్నత పదవులని పొందాలని ఆకాంక్షించారు. అదేవిధంగా స్థానిక దేవాలయాల్లో జానయ్య ప్రత్యేకపూజలు నిర్వహించారు.జిలా కేంద్రంలో అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు.జనగాం క్రాస్ రోడ్డు వద్ద జరిగిన కార్యక్రమంలో అభిమానులు ఏర్పాటు చేసిన బారి ప్రొక్లెన్ ద్వారా బారి గజమాలను జానయ్య మెడలో వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అక్కడ నుండి ర్యాలీగా బయల్దేరిన జానయ్య గాంధీనగర్ సమీపంలో ఉన్న పెద్దమ్మ తల్లి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వజ్ర రైస్ ఇండిస్టీలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ జానయ్యయాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.