Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర (ఎస్ )
సీపీఐ(ఎం) కార్యాలయ స్థలాన్ని ఆక్రమించడం దుర్మార్గమని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దండా వెంకట్‌రెడ్డి విమర్శించారు.మండలకేంద్రంలో ఉన్న సీపీఐ(ఎం) స్థలాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎంపీపీ, గ్రామ సర్పంచ్ ,ఎంపీటీసీ ,సింగిల్ విండో చైర్మెన్లు అక్రమంగా ఆక్రమించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.ఈ విషయమై బుధవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆ స్థలాన్ని పరిశీలించారు.ఈవిషయమై టీఆర్ఎస్, సీపీఐ(ఎం) నాయకులు మధ్య గొడవ చోటుచేసుకుంది.సీపీఐ(ఎం) మండలకార్యదర్శి అవిరె అప్పయ్యపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏండ్లుగా పార్టీ కార్యాలయ కోసం సీపీఐ(ఎం) ఆధీనంలో ఉన్న స్థలంలో టీఆర్ఎస్ నాయకులు కమ్యూనిటీహాల్క ఓసం శంకుస్థాపన చేయడం దుర్మార్గమన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీసభ్యులు మట్టిపల్లి సైదులు, మండలకార్యదర్శి అవిరె అప్పయ్య, మండలకమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సోమిరెడ్డి దామోదర్‌రెడ్డి, నాయకులు యాతాకుల వెంకన్న, యాతాకుల మల్లయ్య, గోలి భాగ్యమ్మ, నెమ్మికల్ మాజీ ఎంపీటీసీ బొప్పని కనకమ్మ, ములకలపల్లి సైదులు, మాతంగి ఈదయ్య పాల్గొన్నారు.