Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, జిమ్మిక్కులు చేసినా, డబ్బు వెదజల్లినా, మద్యం పారించినా మును గోడులో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపును ఎవరూ ఆపలేరని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొండేటి మల్లయ్య అన్నారు.గురువారం స్థానిక రహదారి బంగ్లాలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నిక కోసమే ఆర్భాటంగా దళితబంధును కేసీఆర్ తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజక వర్గంలో అర్హులైన దళితులందరికీ దళితబంధును వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.టీఆర్ఎస్ సర్కార్ నాణ్యతలేని చీరలతో ప్రజలను మోసగిస్తుందని ఆరోపించారు. అనంతరం మండలంలోని వేల్లంకి గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద ప్రత్యేకపూజలు నిర్వహి ంచారు.టీపీసీసీ మెంబర్గా ఎన్నికైన కొండేటి మల్లయ్యను స్థానిక నాయకులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు..ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ జమీరుద్దీన్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు మహమ్మద్ ఎజాస్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు మొహమ్మద్ మహబూబ్అలీ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గురుకు శివ, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ ఇంతియాజ్, వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు జంగయ్య, అయ్యాడపు నర్సిరెడ్డి, నంగునూరు యాదయ్య, తాడూరి వెంకన్న సింగబోయిన గణేష్ పాల్గొన్నారు.