Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్
ప్రతిష్ట ఇండిస్టీస్ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ కోరారు.మండలంలోని ఎస్.లింగోటం గ్రామ పరిధిలోని ప్రతిష్ట ఇండిస్టీస్ కార్మికులు చేపట్టిన సమ్మె ఎనిమిదవ రోజుకు చేరుకుంది.కార్మికులు గురువారం కండ్లకు నల్ల బట్ట కట్టుకొని నిరసన తెలిపారు.కార్మికుల సమ్మెకు ఆయన సంపూర్ణ మద్దతు తెలిపి మాట్లాడారు.కార్మికులు సమ్మె చేపట్టి 8 రోజులు గడుస్తున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్మికులకు 11 నెలలు వేతన ఒప్పందం చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడం తగదన్నారు. కార్మికులతో చర్చలు జరిపి వేతన ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు.రెండేండ్లుగా పెండింగ్లో ఉన్న బోనస్, వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు.కంపెనీలో కార్మికులకు కనీససౌకర్యాలు కల్పించాలని కోరారు.కంపెనీ యజమాన్యం స్పందించకపోతే కార్మికుల పక్షాన పార్టీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళన చేపడ్తామని హెచ్చరించారు.సమ్మెకు తెలంగాణ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరిబాలరాజు, డీివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశం మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, ప్రతిష్ట ఇండిస్టీస్ యూనియన్ ప్రధానకార్యదర్శి గడ్డం వెంకటేశం, నాయకులు దూసరివెంకటేశం, సత్యనారాయణ, భిక్షపతి, శ్రీశైలం, లలిత, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.