Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునగాల: రెండురోజులుగా భారీ వర్షాలు కురవడంతో గణపవరం వాగు పొంగి ప్రవహిస్తుంది.చెర్వులు అలుగులు పోస్తున్నాయి.చివ్వెంల,మోతె, మునగాల మండలాల్లో వర్షం కురవడంతో వాగు వరద ప్రవాహం మరింత పెరిగింది. వాగు పరివాహక ప్రాంతాల్లో సాగు చేసిన వరిపంటలు నీటమునిగాయి.ఏడాదిలో పలుమార్లు వరదలు పారడంతో రైతులు లబోదిబోమంటున్నారు.గణపవరం, గురప్పవాగులు పొంగి ప్రవహిస్తుండడంతో గణపవరం, తిమ్మారెడ్డిగూడెం, కొక్కిరేణి ,వెలిదెండ, తాడువాయి గ్రామ ప్రజలు రాకపోకలకు ఇబ్బందిగా మారింది.వాగుపై వంతెనలు నిర్మించాలని ఆందోళనలు నిర్వహించినా పట్టించుకునే దిక్కేలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.ప్రజల ఇబ్బందులను గుర్తించి వాగులపైన వంతెనల నిర్మాణం చేపట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.