Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలు పరిష్కారమయ్యేనా?
నవతెలంగాణ-యాదాద్రి
సీఎం కేసీఆర్ శుక్రవారం యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు.జాతీయ స్థాయిలో నెలకొల్పనున్న పార్టీ విజయవంతం కావాలని ఇక్కడి స్వామి దర్శనం కోసమే సీఎం ఇక్కడకు వస్తున్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు.కాగా ఇప్పటికే 20సార్లు ఇక్కడి గుడితో పాటు పట్టణంలో పర్యటించారు.యాదగిరిగుట్ట గుడి ప్రారంభించిన అనంతరం మొదటిసారిగా లక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి దర్శించుకో నున్నారు.ఆరు నెలల కింద ఈ యేడు మార్చి 28 ఈ గుడి ఆలయ ప్రారంభంలో పాల్గొన్న సీఎం నేడు మళ్లీ గుట్టకు రానుండడంతో ప్రాధాన్యత సంతరిం చుకుంది.గుడి ప్రారంభమైన భక్తులకు మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఈ ఆరు నెలల నుండి దర్శనార్థమై వచ్చిన భక్తులు నరకయాతన అనుభవిస్తున్నారు.కాగా పనులు కూడా నాసిరకంగా చేపట్టడంతో రోడ్లు కుంగిపోవడంతో పాటు, పలుచోట్ల గుడికి లీకేజీలు కూడా ఏర్పడ్డాయి.అదేవిధంగా కొండపైన విష్ణు పుష్కరిణి చెంత క్షేత్రపాలకుడు ఆలయం ఉండేది కానీ ఇప్పుడు అది క్యూ కాంప్లెక్స్ నిర్మాణంలో బంధించబడింది.ఈ నేపథ్యంలో 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్న సీఎం మాట కోసం భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ సమస్యల పట్ల భక్తుల నుండి తీవ్ర అసంతప్తి నెలకొనగా ముఖ్యమంత్రి గుట్టకు రావడం భక్తులకు ఎంతో ఆశలు రేకెత్తుతున్నాయి. నేటి పర్యటన నేపథ్యంలో భక్తుల సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు.
అనేక సమస్యలు...
యాదగిరిగుట్టలో అనేక సమస్యలు తిష్టవేశాయి.అందులో రోడ్డు వెంట స్ట్రీట్ లైట్లు వెలుగకపోవడం, పట్టణంలో రోడ్లు పూర్తిగా ధ్వంసం కావడం, స్థానిక ప్రజలు ఉపాధి అవకాశం కోల్పోపోవడం, జీవనోపాధికై 300 మంది ఆటో కార్మికుల ఎదురుచూపులు, ఈ ఆటోలు లేక బస్సుల కోసం భక్తుల పాట్లు పడుతుండడం, కొండపైన మరుగుదొడ్ల సౌకర్యం, అదేవిధంగా కొండుతున్న గండిచెరువు సమీపంలో పూర్తిస్థాయిలో మరుగుదొడ్ల సౌకర్యం, వీటితో పాటు రద్దీకి అనుగుణంగా అద్దె గదుల ఏర్పాటు తదితర సమస్యల పరిష్కారానికి సీఎం స్పందిస్తారని భక్తులు భావిస్తున్నారు.
సీఎం పర్యటన....
సీఎం కేసీఆర్ ఉదయం 10:30 కు ప్రగతి భవన్ నుండి బయల్దేరి రోడ్డు మార్గంగుండా గుట్టకు చేరుకుంటారు.యాదగిరికొండపై స్వామిని దర్శించుకొని ఇక్కడే లంచ్ చేసి తిరిగి సాయంత్రం 4 గంటలకు రోడ్డు మార్గం ద్వారానే హైదరాబాద్ బయల్దేరి వెళ్తారు.