Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డు పరిరక్షణకై పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్లో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) అనుబంధ తెలంగాణ కమ్మరి, వడ్రంగి, కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ పట్టణ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కార్మికుల పోరాట ఫలితంగా ఏర్పడిన భవనిర్మాణ సంక్షేమ బోర్డులో 14 లక్షల మంది మాత్రమే నమోదు చేసుకుంటే అందులో ఎనిమిది లక్షల మంది కార్మికులు రెన్యువల్ చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది నిర్మాణ రంగ కార్మికులు ఉన్నారని ఇంకా ఆరు లక్షల మంది నమోదు కాలేదన్నారు. ముఖ్యమంత్రి నిర్మాణ కార్మికులకు లక్ష బైకులు ఇస్తామని వాగ్దానం చేసి అమలుకు నోచుకోలేదని అన్నారు. సంక్షేమ బోర్డు నిధులను పక్కదారి పట్టిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. వందలాది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని కార్మిక శాఖలో అనేక పోస్టులు ఖాళీ ఏర్పడి కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే అధికారులు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ పట్టణంలో కార్పెంటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఐటీయూ నిరంతరం పనిచేస్తుందని, అటవీశాఖ అధికారుల వేధింపులు, ఇంటి యజమానుల నుండి రావలసిన డబ్బులు ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపరిహారం గురించి కార్మికులకు అండగా ఉంటుందన్నారు. ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హాశమ్, బీసీ డబ్ల్యూ యూ జిల్లా సహాయ కార్యదర్శి అద్దంకి నరసింహ పాల్గొని సందేశాలు ఇచ్చారు. అనంతరం పట్టణ నూతన కమిటీని 19 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) పట్టణ అధ్యక్షులు సలివోజు సైదాచారి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో దాసోజు ప్రభు చారి, మల్లోజు ద్రోణాచారి, ప్రాపాచారి, జనార్ధన చారి, సైదాచారి, సోమయాచారి, నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.
పట్టణ నూతన కమిటీ..
గౌరవాధ్యక్షులుగా అద్దంకి నరసింహ, అధ్యక్షులుగా సలివోజు సైదాచారి, ఉపాధ్యక్షులుగా బైరోజు ఆంజనేయులు, ఏలేశ్వరం జగదీష్, గడగోజు మధు చారి, ప్రధాన కార్యదర్శిగా దాసోజు ప్రభుచారి, సహాయ కార్యదర్శిగా విశ్వనాధుల నరసింహచారి, గుంటోజు సోమయాచారి, గడగోజు సైదాచారి, కోశాధికారిగా కావునపల్లి సురేష్, ప్రచార కార్యదర్శిగా గడగోజు శ్రీనివాసచారి, గౌరవ సలహాదారులుగా మల్లోజు ద్రోణాచారి, చోల్లేటి పాపాచారి, విశ్వనాధుల కృష్ణయ్య చారి, కొల్లోజు జనార్ధనాచారి, కార్యవర్గ సభ్యులుగా కేసారపు కనకయ్యచారి, పగడోజు శ్రావణ్, దేవులపల్లి సాంబయ్య, బైరోజు వెంకటాచారిలను ఎన్నుకున్నారు.