Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
హమాలి కార్మికులు ఐక్యంగా ఉండి పోరాటాలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డబ్బికార్ మల్లేష్ కోరారు. గురువారం స్థానికంగా సిమెంట్ లోడింగ్, అన్లోడింగ్ హమాలి కార్మికుల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధనకు బలమైన ఉద్యమాలు చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలన్నారు. హమాలిలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి హాజరు కాగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మచ్చ ఎల్లయ్య, ఉపాధ్యక్షులుగా సత్యం, కార్యదర్శిగా వంగదారి కృష్ణ, సహాయ కార్యదర్శిగా బాబురావు, కోశాధికారి వనం నగేష్, కమిటీ సభ్యులు కే. వెంకన్న, వి.నాగయ్య, బంటు శివ, పి చంద్రయ్యలను ఎన్నుకున్నారు.