Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
మండలంలోని బీఎన్ తిమ్మాపురం భూ నిర్వాసితులకు నష్ట పరిహారం ఇప్పించాలని కోరుతూ ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామియాదవ్, ఎంపీటీసీ ఉడుత శారద ఆంజనేయులుయాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామ రైతులకు అందరికీ భూముల నష్టపరిహారం ఇంతవరకు చెల్లించలేదన్నారు.అందరికి భూముల నష్టపరిహారం త్వరగా ఇప్పించాలని కోరారు.సీలింగ్ కబ్జా భూములకు కూడా పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కొందరికి మాత్రమే వర్తించిందన్నారు. ఇప్పటివరకు 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఇద్దరు భార్యలు ఉన్న కుటుంబానికి ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇద్దరికి ఇవ్వాలని, మిగిలిన వారందరికీ కూడా ప్యాకేజీని త్వరగా ఇప్పించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మంత్రులు స్పందించి అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.