Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
చర్లగూడెం ప్రాజెక్టు భూనిర్వాసితులు మునుగోడు దీక్షకు వెళ్తున్న సమయంలో మండలంలోని తాస్కానిగూడెం గ్రామం దగ్గర చండూర్, మునుగోడు పోలీసులు గురువారం అడ్డగించి డీసీఎం వ్యాన్లను వెనక్కి పంపారు. చండూర్‌కి రాగానే స్థానిక చౌరస్తాలో భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ భూ నిర్వాసితులు మద్దతు తెలిపారు. రోడ్డుపైన బెటాయించిన నిర్వాసితులను అరెస్ట్ చేసి చండూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి, చెల్లాచెదురు చేశారు. చెరుకు సుధాకర్ మాట్లాడుతూ మల్లన్న సాగర్‌కు నష్టపరిహారం ఏ విధంగా కేటాయించారో శివన్నగూడెం రిజర్వాయరు మాదిరిగా కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూనిర్వాసితులు, కాంగ్రెస్ నేతలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.