Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ జీవో వెంటనే ఇవ్వాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు రవినాయక్ అన్నారు. గురువారం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారంలో జిఓ ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో తేకుండా గిరిజనులను మరోసారి మోసం చేశారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో అనేక ఎన్నికల సభలలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో మా ప్రభుత్వం వస్తే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ జీవోను మొదటి జీవో తీసుకొస్తామని చెప్పి 8 సంవత్సరాలుగా మోసం చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 17వ తేదీన ఆదివాసుల భవన్ ప్రారంభ బహిరంగ సభలలో వారం రోజుల్లో కేంద్రంలో మోడీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ జీవోను తీసుకొస్తామని చెప్పి నేటికీ 11 రోజులు అవుతున్న జీవో మాత్రం రాలేదన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం నాయకులు శ్రీను నాయక్, దేశిరం నాయక్, జగన్ నాయక్, ఉపేందర్నాయక్, శేఖర్, రాజు, రాగ్య తదితరులు పాల్గొన్నారు.