Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆత్మకూర్ ఎస్
చివ్వెంల మండలం నుండి ఆత్మకూర్ ఎస్ మండలం మీదుగా నూతనకల్ మండలం మిర్యాల కు రోజు వందలాది వివిధ రకాల వాహనాలు ప్రయాణం కొనసాగిస్తున్నాయి. ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలోని నసీంపేట నుండి నూతనకల్ మండలం మిరియాల గ్రామం మీదిగా మద్దిరాల మండల పరిధిలో ఉండే గ్రామాలతో పాటు మహబూబాబాద్ జిల్లా లోని వివిధ మండలాలు గ్రామాలకు వెళ్లేందుకు ఆత్మకూరు ఎస్ మండలం నసీంపేట గ్రామం నుండి వివిధ అవసరాల కోసం ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ముందుగా నసీంపేట గ్రామం లోకి వెళ్లాలంటే నిమ్మికల్, ఆత్మకూరు ఎస్ ,నశీ%శీ%పేట గ్రామాల నుండి పారుతున్న గొలుసు కట్టు చెరువుల ద్వారా ప్రయాణించే నీటిని దాటి వెళ్ళాలి. ఈ రహదారిపై బ్రిడ్జి లేకపోవడం మూలంగా ఏమాత్రం చిన్న వర్షం పడిన నీరు రోడ్డుపై ప్రవహించడం మూలంగా రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. దీంతో సుమారుగా 15 గ్రామాల ప్రజలు సూర్యాపేట వెళ్లాలన్న సూర్యాపేట నుండి నూతనకల్ మహబూబాబాద్ జిల్లా లోని వివిధ గ్రామాలకు ఇబ్బంది కలుగుతుంది . ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వలన రోడ్డుపై వరదా నీరు వచ్చి సూర్యాపేట కు మరియు నూతనకల్ మండల పరిధిలోని గ్రామాలకు వెళ్లే ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇలా వరదలు రావడం వలన గతంలో ఈ రోడ్డు పై ప్రయాణం చేసిన ద్విచక్ర వాహనాలు, కార్లు, ప్రయాణికులు కొట్టుకుపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి . కావున ఈ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం చేపడితే సూర్యాపేట, నుండి వివిధ మండలాలకు, గ్రామాలకు వెళ్లే ప్రజలకు ఎలాంటి అంతరాయ%శీ% లేకుండా ప్రయాణం చేయవచ్చు. కావున అధికారులు ,ప్రజాప్రతినిధులు స్పందించి నశింపేట రోడ్ పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.
బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలి
సిపిఎం మండల కార్యదర్శి అవిరే అప్పయ్య
సూర్యాపేట నుండి వివిధ అవసరాల నిమిత్తం ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలోని నసీంపేట గ్రామం గుండా వివిధ గ్రామాలకు వెళ్లే ప్రజలు నసీంపేట గ్రామంలో రహదారిపై బ్రిడ్జి లేకపోవడంతో రాకపోకలు కొనసాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై అనేకసార్లు అధికారులకు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తక్షణమే బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలి.