Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేతపల్లి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం కేతపల్లి మండలం బండపాలెం గ్రామంలో రూ.16లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం కేతపల్లి మండల కేంద్రం బండపాలెం గ్రామాలల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేసి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పల్లెలన్నీ క్రమక్రమంగా ప్రగతి పథంలో పయనిస్తున్నాయని చెప్పారు.
కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ..
కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శం అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం కేతపల్లి మండలానికి చెందిన 50మందికి కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో బండపాలెం గ్రామ సర్పంచి వంగూరి జయమ్మ, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, తాసిల్దార్ వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారం వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి చెమట వెంకన్నయాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.