Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు (ఎఫ్పీఓ) ఆర్ధికంగా నిలదొక్కుకోవాలంటే ఈక్విటీ గ్రాంట్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. ఈ రెండు స్కీంల ద్వారా రుణం పొందే అవకాశాన్ని జిల్లాలో ఉన్న రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు వినియోగించుకొని, బలోపేతం కావాలని ఆయన కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్మాల్ ఫార్మర్స్ ఆగ్రి కన్సార్టియం (ఎస్.ఎఫ్.ఏ.సి) సహకారముతో ఏ .ఎఫ్.సి ఆధ్వర్యములో నల్గొండ జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల కంపెనీ, వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, బ్యాంకు అనుబంధ సంస్థలు, సి.బీ. బి. ఓ లకు ఈక్విటీ గ్రాంట్, క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్స్ ఫై నిర్వహించిన అవగాహనా కార్యక్రమములో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత మాట్లాడుతూ ఎఫ్పిఓలు అభివృద్దికి గాను వ్యవసాయ శాఖ సహకారం ఉంటుందని తెలిపారు. ప్రతి వ్యవసాయ విస్తరణ, మండల వ్యవసాయ అధికారులు రైతు ఉత్పత్తిదారుల కంపెనీల సమావేశాలకు హాజరై వారికి వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన సలహాలు సూచనలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎఫ్.సి అధికారి ప్రసన్నపది, రిసోర్స్ పర్సన్ నాగబ్రహ్మచారి, అగ్రికల్చర్ అధికారి మురళి, మండల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు, సీబీబీఓసీఎస్ఏ ప్రతినిధులు, ఎఫ్పిఓ ప్రతినిదులు, రైతులు పాల్గొన్నారు.