Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
బతుకమ్మ చీరలతో నేతన్నకు ఆసరా లభించిందని ఎంపీపీ బాచుపల్లి శ్రీదేవి గంగాధర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం మండలం లోని నర్సింహాపురం గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారం భించి మాట్లాడారు. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుంటే కొంతమంది సామాజిక మాధ్యమాలలో అపహస్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలోఉపసర్పంచ్ చింతల లింగయ్య, వార్డుసభ్యులు కుంచం యమున, కందికంటి నరేష్, నాయకులు మారెడ్డి వెంకటరెడ్డి, మాలె వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
నాంపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు అందిస్తున్న చీరలను శుక్రవారం నాంపల్లి మండలంలోని శుంకిశాల గ్రామంలో సర్పంచ్ బాషిపాక రామన్న పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నూతన్‌కుమార్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మాద లచ్చయ్య, కార్యదర్శి అందుగుల వెంకటయ్య, యడమ సుమతమ్మ, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.