Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాటి పోరాటంలో పాల్గొనని బీజేపీ తప్పుదారి పట్టించే చర్యలను ప్రజలు తిప్పి కొట్టాలి...
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ- వలిగొండరూరల్
నాడు జరిగిన సాయుధ పోరాటంలో భూమి కోసం ,భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రజల్ని సమీకరించి పోరాడిన చరిత్ర కమ్యూనిస్టులదేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ అన్నారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రజలు నైజం రజాకార్లకు వ్యతిరేకంగా భూస్వాముల దోపిడి దౌర్జన్యాల వ్యతిరేకంగా తిరగబడ్డారని ఆ పోరాటంలో ఈ ప్రాంతానికి సంబంధించిన గాంధీ వెంకట నరసింహారెడ్డి నాయకత్వంలో ప్రజలు తిరగబడ్డారని తెలిపారు. గురువారం రాత్రి మండలంలోని మొగిలిపాక గ్రామంలో జరిగిన సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా గ్రామంలోని నాటి పోరాటంలో పాల్గొన్న అమరవీరుల కుటుంబాలకు సన్మానం నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ నాటి పోరాటం కులం మతం ప్రాంతానికి సంబంధం లేకుండా ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రం దోపిడీపీ నుండి విముక్తి కోసం జరిగిందని ఆ పోరాటంలో పాల్గొన్న దాంట్లో మొగిలిపాక గ్రామానికి చెందిన గాంధీ వెంకట నరసింహారెడ్డి నాయకత్వంలో గ్రామంలోని 16 మంది దళ సభ్యులుగా ఏర్పడి అనేక గ్రామాల్లో నైజాం రజాకార్ల భూస్వాముల దోపిడీ దౌర్జన్యాలపై ప్రజల్ని చైతన్యం చేసి తిరుగుబాటుకు గురిచేశారని తెలిపారు. వారి వారసత్వాన్ని నేడు కులం మతం ప్రాంతం పేరుతో వైశాల్యాలు సృష్టిస్తున్న బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ప్రజా సమస్యలపై వారి స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ సభకు గ్రామ శాఖ కార్యదర్శి గుండెపురి నరసింహ అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య గడ్డం వెంకటేష్ బొడ్డుపల్లి వెంకటేష్,మండల కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ మొగిలిపాక గోపాల్ ,సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మామిడి వెంకటరెడ్డి పీిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, మండల కమిటీ సభ్యులు కవిడే సురేష్, రైతు సంఘం మండల నాయకులు జక్క రాఘవరెడ్డి, ఆ పార్టీ శాఖ సహాయ కార్యదర్శి సంఘీ శ్రీనివాస్, నాయకులు మొగిలిపాక జహంగీర్ మర్ల నరసింహ అమర వీరుల కుటుంబ సభ్యులు వారాల సుభాష్,జక్కా జనార్దన్ రెడ్డి, జక్కా రాంరెడ్డి,జక్కా గణేష్ రెడ్డి,జక్కా వెంకటరెడ్డి, వారాల మధు,యాస రాజశేఖర్ రెడ్డి,గడ్డం నారాయణ,మొగిలిపక యాదయ్య,తొండల బాలయ్య, పాల్గొన్నారు.