Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హత అనుమతులు లేకుండా క్లినిక్ లు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు
- డీఎల్ఓ వై. పాపారావు
నవతెలంగాణ -రామన్నపేట
మండల కేంద్రంలో ఎలాంటి అర్హత, అనుమతులు లేకుండా చికిత్సలు నిర్వహిస్తూ, ఫార్మసి నడుపుతున్న రారు క్లినిక్, ఫార్మసీని శుక్రవారం డిఎల్ఓ అధికారులు ఆకస్మిక తనిఖీ చేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ అర్హులైన వైద్యులు లేకుండా ఆస్పత్రులు, క్లినిక్ లు నడపరాదని, అర్హత, టెక్నికల్ ధ్రువీకరణ పత్రాలు లేకుండా ల్యాబ్ లను, ఫార్మసీలను నిర్వహించరాదని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా అకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. రారు క్లినిక్ లో ఐదుగురు ఇన్ పేషెంట్లు ఉన్నారని, వారికి సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తూ చికిత్స నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. గుట్టల్లాగా కాళీ సెలైన్ బాటిల్స్ పోసి ఉండడం ఆశ్చర్యం అనిపించిందని ఆయన తెలిపారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇలాంటి అనుమతులు లేని క్లినిక్ లకు పోయి చికిత్స పొందవద్దని, దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకోవాలని అర్హులైన వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. ఆయన వెంట స్థానిక పిపి యూనిట్ డాక్టర్ ఈసం వెంకటేశ్వర్లు, పల్లె దవాఖాన వైద్యులు నరేందర్ ధరణి కుమార్ వెంకన్న సైదులు ఉన్నారు.