Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్ జక్కిడి జంగారెడ్డి
- శ్వేత పత్రం విడుదల
నవతెలంగాణ- సంస్థ నారాయణపురం
నారాయణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని అభివృద్ధింలో తీసుకెళ్తున్నామని అధ్యక్షులు జక్కిడి జంగారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పీఏఎస్లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన పాలకవర్గం ఏర్పాటైనప్పటినుంచి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేశారు.నాడు 30 వేల లాభాలతో ఉన్న సహకార సంఘాన్ని 2020 ఫిబ్రవరి 16న ఏర్పడిన నూతన పాలకవర్గం రెండేళ్ల కాలంలోనే 64లక్షల43వెలు లాభాలకు తీసుకొచ్చినట్టు తెలిపారు. సంఘాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని టాప్ 5వ స్థానంలోకి తీసుకొచ్చామన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,స్థానిక ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్చందర్ రెడ్డిల సహకారంతో రూ.2 కోట్లా50 లక్షల విలువ గల 5 ఎకరాల ప్రభుత్వ భూమిని సాధించి సహకార సంఘం పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించి పెట్టామన్నారు.శిధిలావస్థకు చేరిన సహకార సంఘం పాత గోదాములను మరమ్మతు చేసినట్టు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 129 సొసైటీలో కాంపోస్టు లోను కింద కోపరేటివ్ బ్యాంక్ సెలెక్ట్ అయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సర్పంచ్ సెటిల్మెంట్ల శ్రీహరి వైస్ చైర్మన్ లచ్చిరాం నాయక్ డైరెక్టర్లు బొడ్డుపల్లి గాలయ్య ఉప్పల కృష్ణ, ముత్యాల అంజయ్య, చెరుకుపల్లి నరసింV,ా బానోతు కిషన్, గడ్డం పాపమ్మ, బెల్లంకొండ పారిజాత శంకర్ ,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జక్కడి యాదిరెడ్డి, రైతులు రాచకొండ రమేష్ చిలువేరు బిక్షం, కొండూరు ముత్యాలు ,చింతల కిష్టయ్య ,తదితరులు పాల్గొన్నారు.