Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మండలంలోని రాయగీరి గ్రామ శివారులో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన వెలిసిన ఓ ప్రయివేటు వెంచర్ వివాదాస్పదంగా మారుతున్నాయి. ప్రయివేటు వెంచర్ నిర్వాహకులు తమ భూమిని అక్రమంగా వెంచర్ లో కలుపుకొని ఇష్టారాజ్యంగా ప్లాట్లు చేస్తున్నారని రైతు ఎంఏ.రహీం ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ తమకు భూమి ఉందని వస్తే అడంగా కంచె వేస్తున్నారని అన్నారు. శుక్రవారం ఆ రైతు తనకు సంబంధించిన భూమిలో మండల సర్వేయర్ రజనీకాంత్ తో హద్దులు ఏర్పాటు చేయించారు. అనంతరం మీడియాతో తన ఆవేదనను వెలిబుచ్చారు. మండలంలోని రాయగీరు గ్రామ శివారులో సర్వే, నంబర్ 530, 531, 532, 535, ఈ నాలుగు సర్వే నెంబర్లలో మొత్తం 04.11 గంటలకు భూమి తన పేర ధరణి ద్వారా పట్టాదారు పాసుబుక్కు కలిగి రైతుబంధు కూడా వస్తున్నట్లు ఆయన తెలిపారు. తన భూమి వద్దకు పోతుంటే పైవేట్ వెంచర్ నిర్వాహకులు పోనివ్వకుంట అడ్డంగా కంచే వేస్తున్నారని, తను హార్ట్ పేషెంట్ అని కూడా చూడకుండా దాడికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను హైకోర్టులో పిటిషన్ వేసి, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి మండల సర్వేర్ రజనీకాంత్ సహకారంతో వెంచర్లో హద్దురాళ్లు నాటిస్తున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో వెంచర్ నిర్వాహకులతో నాకు భయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భూమికి సంబంధించిన పత్రాలు ఆధారాలతో సహా పిర్యాదు చేసినట్లు తెలిపారు. సంబంధిత వ్యక్తులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత వెంచర్ వారిని వివరణ కొరగా అందుబాటులోకి రాలేదు.