Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్
సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మండలంలోని కుంట్లగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామశాఖ ప్రధానకార్యదర్శి దోర్నాల అంజయ్య, సీనియర్ నాయకులు బాల విఠల్, దోర్నాల రామస్వామి, బాల భద్రయ్య, కర్నాటి కృష్ణమూర్తితోపాటు 100 కుటుంబాల కార్యకర్తలు ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. చేరిన వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మెన్ చింతల దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గిరికటి నిరంజన్‌గౌడ్, సర్పంచ్ మిర్యాల పారిజాతగోపాల్, నాయకులు పర్సగోని పాండు, వల్లకాటి అనిల్‌కుమార్, మల్లెబోయిన లక్ష్మయ్య, ఈపూరి శేఖర్, ఒంటెద్దు లింగస్వామి, బందెల స్వామి, బండి జగన్, గంగదేవి రమేశ్, శ్రీపతి స్వామి పాల్గొన్నారు.