Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ వృథా
నవతెలంగాణ - ఆలేరుటౌన్
పట్టణకేంద్రంలో వీధి విద్యుత్ దీపాల( స్ట్రీట్ లైట్స్)బ పగటి సమయంలో వెలుగుతున్నాయి .నిర్వహణ నియంత్రణ సక్రమంగా లేదు . పట్టణంలో పలు వార్డుల్లో విద్యుద్దీపాలు పట్టపగలు వెలుగుతూ విద్యుత్తు వృథా అవుతున్నది. అంతేకాకుండా లైట్స్ మన్నిక కాలం తక్కువై తొందరగా పాడైపోతున్నాయి. నెలలు కావస్తున్నా ,వాటి స్థానంలో కొత్తవి వేయకపోవడంతో అంధకారం నెలకొంటున్నది. టెక్నాలజీ ప్రకారం మనిషి అవసరం లేకుండా సెన్సార్ టైమర్ లతో వాటంతట అవే వెలిగే సదుపాయం ఉన్నా పురపాలక సంఘం వారు వాటిని సరిగా నిర్వహించడం లేదు.పట్టపగలు విద్యుద్దీపాల వెలుగులతో పురపాలక సంఘానికి దాదాపు 5 నెలకు లక్ష రూపాయల వరకు అదనంగా బిల్లులు వస్తున్న సంగతి విద్యుత్ అధికారులు చెబుతున్నారు .విషయం పురపాలక సంఘం కమిషనర్ మారుతీ ప్రసాద్ దృష్టికి నవతెలంగాణ తీసుకువెళ్లగా విద్యుత్ స్తంభాల వద్ద ఆన్ఆఫ్ స్విచ్లు పెట్టిస్తామని పట్టపగలు విద్యుత్ దీపాలు వెలగాకుండా చూస్తామని తెలిపారు .
వందవరకు విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి:బందల సుభాష్
మానవ మనుగడకు నేడు విద్యుత్ ఎంతో అవసరం ఉన్నా దాని విలువ తెలియని అధికారులు ,పాలకవర్గం విద్యుత్ దీపాలను పట్టపగలు వెలిగిస్తూ నిర్లక్ష్యంతో విద్యుత్ వృథా చేస్తూ కరెంట్ బిల్లు స్థానంలో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని పట్టణానికి చెందిన బ%శీ%దల సుభాష్ అన్నారు. పట్టణంలో దాదాపు వంద వరకు విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి
పట్టపగలు విద్యుత్ వెలుగులను నియంత్రించాలి:ఎర్ర .ప్రసాద్ బాబు
ఆలేరు పురపాలక సంఘంలోని వివిధ కాలనీలలో పట్టపగలు విద్యుత్ వెలుగులను పురపాలక సంఘం అధికార్లు సిబ్బందిచే నియంత్రించాలి .గతంలో అనేకసార్లు పత్రికలో పట్టపగలు విద్యుత్ వెలుగులు అనే శీర్షిక వచ్చినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.